కృత, త్రేత, ద్వాపరయుగాలలో అన్నివయసుల స్త్రీలూ పురుషుల దుర్మార్గాలకు బలైపాయారు. కానీ కలియుగంలో మహిళలు భూమిని పరిపాలిస్తారు. ఇది ఆయన కాలజ్ఞానం. కాలజ్ఞానం అంటే ఉన్న పరిస్థితులను బట్టి రాబోయే మార్పులను గుర్తించడం. ఇప్పుడు నడుస్తున్నది కలియుగం అని సంప్రదాయవాదులంటారు. బ్రహ్మంగారు చెప్పినది కాలం ఎప్పుడూ ఒక వర్గానికే అనుకూలంగా ఉండదని పీడితవర్గాల చైతన్యంలోంచి సామాజిక మార్పు రాక తప్పదని, ఇప్పటికే భారతదేశం, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలలోనూ చాలా రాష్ట్రాలలోను మహిళలు రాజ్యాధికారానికి వచ్చారు. ప్రపంచమంతా ఇవాళ మహిళా చైతన్యం పెల్లుబుకుతున్నది. అయితే ఆమేరకు వాళ్ళపైన దౌర్జన్యాలూ పెరుగుతున్నాయి. పురుషులలో స్త్రీపట్ల దృష్టి మారవలసినంతగా మారలేదు. స్త్రీపట్ల మధ్యయుగ భావజాలం ఇంకా కొనసాగుతున్నది. దానిని అరికట్టడానికి ఆధునిక చైతన్యంతోబాటు మధ్యయుగకవి బ్రహ్మంగారు పూర్వరంగంగా ఉపయోగపడతారు.