డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.38 కోట్లు కొట్టేసిన సైబర్ కేటుగాళ్లు

మీ బ్యాంక్ అకౌంట్ల ద్వారా మనీ లాండరింగ్ జరిగింది... మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని భయపెట్టి ఓ 82 ఏళ్ల రిటైర్డ్ ఇంజనీర్ నుంచి 1.38 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు సైబర్ నేరగాళ్లు. వృద్ధుడి పిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన రిటైర్డ్ ఇంజనీర్(82)కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్బిఐ ప్రతినిధి అంటూ పరిచయం చేసుకున్నాడు.