అయోధ్య కోటి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్న భక్తులకు సూచన
Ramana Rao P 10 December 2023 12:07 AM
Views : 41
Location :
అయోధ్య కోటి హనుమాన్ చాలీసా పారాయణము చేస్తున్న భక్తులకు సూచన. గుడ్లూరు, అమరావతి జ్యోతి:
అయోధ్య శ్రీ రామ ప్రతిష్ట నేపద్యంలో 100కోట్ల హనుమాన్ చాలీసా పారాయణము లక్ష్యంగా చాలీసా పారాయణము జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎవరి మార్గాలలో వారు అయోధ్యకు కోటి హనుమాన్ చాలీసా పారాయణము చేసి పంపుతున్నారు. లక్ష్య సాధనలో భాగంగా మనకు శైలజ అమ్మ సులోచన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అయోధ్యకు కోటి హనుమాన్ చాలీసా పారాయణము కౌంట్ పంపుతున్నాము. దారి తెలియని అయోమయంలో ఉన్న మనకు గమ్యం చేరడానికి ఒక కాలిబాట లాగా, కలిమాయ లో చిక్కుకుని బావిలో ఉన్న మనకు అది అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఒక తాడుల శైలజ అమ్మ మార్గం చూపారు. ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ కష్టాల కడలిలో కూరుకు పోయిన మనకు మోక్ష మార్గం సాధనకు హనుమాన్ చాలీసా పారాయణము మార్గం చూపుతుంది. అదే మనలను మోక్ష మార్గం దిశగా శ్రీరామ నామం తో మన మనసుని సందించి ఆ పావన రాముని సన్నిధికి చేరుస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. అందరూ మనకు ఉన్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని
శ్రీ రామ భక్త హనుమ భక్తుల పాద రేణువు. ఆలూరి వెంకట హనుమంతరావు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.
జై శ్రీరామ్ .