జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్సీ కార్పొరేషన్ ఈ.డి..
విజేత రేవల్లి, వనపర్తి, ప్రతినిధి :
వనపర్తి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ E.D గా గురువారం బాధ్యతలు చేపట్టిన ఎండి సిరాజుద్దీన్ జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. వనపర్తి లోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎం.డి సిరాజుద్దీన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఇరువురు కార్యాలయంలోని వివిధ అంశాల గురించి చర్చించారు.