పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోష వ్యాధుల చికిత్స శిబిరం..... – జిల్లా పశు వైధ్యాధికారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్. శ్రీలక్ష్మి
విజేత,నర్సంపేట :
ఖానాపూర్ మండలం లోని ధర్మారావు పేట గ్రామంలో జిల్లా పశు గణాభివృద్ధి సంస్థ పశుసంవర్ధక శాఖ వారి ఆధ్వర్యంలో ఉచిత గర్భకోష వ్యాధుల చికిత్స శిబిరం, నిర్వహించడం జరిగింది. శిబిరాన్ని స్థానిక సర్పంచ్ మాడ్రాజు.వెంకన్న, హాజరై ప్రారంభించడం జరిగింది ఈ శిబిరంనకు ముఖ్యఅతిథిగా స్థానిక పశువైద్యాధికారినీ జిల్లా పశు వైధ్యాధికారుల సంఘం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్,, శ్రీలక్ష్మి హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ... పుట్టిన ప్రతి దూడకు గంటలోపు జున్ను పాలు తాగించవలెను దానివలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. దూడ పుట్టిన 24 గంటల లోపల టీటీ ఇంజక్షన్ వేయించుకోవడం వలన ధనుర్వాతం రాకుండా నివారించవచ్చు, ప్రతి రైతు కనీసం 10 గుంటల భూమిలో పచ్చగడ్డి వేసుకోవాలని సూచించారు. డాక్టర్ బొమ్మెడ రవీందర్,ఏ డి మామునూరు హాజరై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఆవులలో ఎదకాలం 24 గంటలు ఉంటుంది, గేదెలలో ఎదకాలం 36 గంటలు ఉంటుంది. కావున రైతులు ఆవులు ఉదయం ఎదకు వస్తే సాయంత్రం కృత్రిమ గర్భధారణ చేయించాలి అలాగే గేదెలు ఉదయం ఎదకు వచ్చిన సందర్భంలో మరుసటి రోజు ఉదయం కృత్రిమ గర్భధారణ చేయించాలని సూచించారు. ఈ శిబిరంనకు ఉపసర్పంచ్ కొంకటి రాజు,గోపాలమిత్ర సూపర్వైజర్ యండి జహంగీర్, పాలకేంద్రం అధ్యక్షులు టీ టీ కే హెల్త్ కేర్ కంపెనీ ప్రతినిధి ఏన్ పృధ్వీరాజ్, గోపాల మిత్రులు సిహెచ్ .లక్ష్మి నారాయణ. కే నరసింహ చారి బి. మధుకర్, ఎండీ.మాజిద్, ప్రశాంత్,గ్రామ రైతు సోదరులు హాజరైనారు. ఈ శిబిరంలో 78 పశువులు రాగా,32ఎదకు రాని 28 దూడలకు నట్టల నివారణ మందులు 8 గర్భకోశ వ్యాధులు 10 పశువులకు సాధారణ చికిత్సలు జరిపి ఉచితంగా మందులు పంపిణీ చేసారు.