గ్రామాలలో నామినేషన్లు దాఖలు.
అక్షర విజేత, చిన్నంబావి .
చిన్నంబావి మండలం వెల్లటూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బిజెపి మద్దతు తో బలపరిచిన అభ్యర్థిగా పరమాళ్ల వెంకట లక్ష్మి-ప్రకాష్, బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. బిఆర్ఎస్ పార్టీ బిజెపి పొత్తు తో బలపరిచిన అభ్యర్థిగా క్లస్టర్ అయ్యవారిపల్లి గ్రామం నందు రైతు వేదికలో నామినేషన్ కేంద్రంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. అదేవిదంగా వెల్లటూర్ గ్రామ పంచాయతీ ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా కురువ భాగ్యమ్మ పెద్ద మల్లయ్య బుధవారం తమ నామినేషన్ అయ్యవారిపల్లి క్లస్టర్ రైతు వేదిక లో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా భాగ్యమ్మ మాట్లాడుతూ వెల్లటూర్ గ్రామ పంచాయతీ ప్రజలు తనను ఆశీర్వదిస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని వారు అన్నారు.అదేవిదంగా గూడెం గ్రామంలో మామిళ్ళపల్లి గణేష్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా బెక్కెం గ్రామపంచాయతీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ నాయకులు కురువ చిన్న మల్లయ్య ,బీఆర్ఎస్ పార్టీ పరమళ్ల ప్రకాష్ ,పరమళ్ల నరసింహ, పార్టీలనాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు .