పోలికపాడు గ్రామంలో ఆయిల్ ఫామ్ చెట్టు దగ్ధం...ఆయిల్ ఫామ్ ఉన్న కంచె ధ్వంసం..అజాగ్రత్తకు కారణమైన మంద వెంకట్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలి
విజేత రేవల్లి, వనపర్తి, ప్రతినిధి :
వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పరిధిలోని పోలికే పాడు గ్రామానికి చెందిన రైతు మంద తిరుపతిరెడ్డి తన వ్యవసాయ భూమిలో ఆయిల్ ఫామ్ గత నాలుగు సంవత్సరాల నుండి సాగు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గత రెండు మూడు రోజుల క్రితం పక్క రైతు మంద వెంకటరెడ్డి గట్టుపై ఉన్న చెత్తను అంటించగా చెత్త కాలుతూ పోయి మంద తిరుపతి రెడ్డికి చెందిన ఆయిల్ పంప్చెట్టు దగ్ధమైనది అని రైతు వాపోయాడు ఆ జాగ్రత్త గా చెత్త ఆర్టిస్తూ ఆయిల్ ఫామ్ చెట్టు దగ్నానికి కారణమైన మంద వెంకటరెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. అదేవిధంగా గోపాల్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.