*స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి* *కందుకూర్ పరిధిలో రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తి మృతి, ఒకరికీ గాయాలు*
*అక్షర విజేత మహేశ్వరం*
మహేశ్వరం నియోజకవర్గ కందుకూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరొక వ్యక్తికి గాయాలు అయినాయి. కందుకూర్ సిఐ, సీతారాం, తెలిపిన వివరాల ప్రకారం, తేదీ 17.10.2025 నాడు సాయంత్రం కేషంపేట మండలం బైరఖాన్ పల్లి గ్రామానికి చెందిన కుమ్మరి నారాయణ తండ్రి మల్లయ్య, వయస్సు 50 సం//లు అను వ్యక్తి మరియు అదే గ్రామానికి చెందిన దన్నడి శేకర్ యాదవ్ తండ్రి కిష్టయ్య, వయస్సు 48 సం//లు అను ఇద్దరు కలిసి వారి యొక్క మోటార్ సైకిల్ పై కందుకూర్ నుండి బైరఖాన్ పల్లి గ్రామానికి వెళుతుండగా మార్గమధ్యలో జైత్వారం గ్రామం దాటిన సాయంత్రం 05:00 గంటలకు వారికి ఎదురుగా వస్తున్న క్రెక్ స్కూల్ బస్సు డ్రైవరు తన బస్సును అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి బైక్ కు టక్కరు ఇవ్వగా బైక్ పై ఉన్న ఇద్దరు క్రిందపడగ, బైక్ నడిపిన కుమ్మరి నారాయణ తలకు, కాళ్ళకు, చేతులకు తీవ్ర గాయాలు అయి అక్కడికక్కడే చనిపోయినాడు, బైక్ వెనకాల కూర్చున్న శేకర్ యాదవ్ కు కూడా కాళ్ళకు రక్త గాయాలు అయినాయి. వెంటనే గాయపడిన శేకర్ ను చికిత్స నిమిత్తం శంషాబాద్ లోని ట్రిడెంట్ ఆసుపత్రికి అంబులెన్సు లో తరలించినారు. ఇట్టి ప్రమాదములో చనిపోయిన కుమ్మరి నారాయణ, ను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినారు. ఈ ఘటనపై మృతుని బంధువులు ఇచ్చిన పిర్యాదు పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.