*చెరుకూరి నాగార్జునపై మధిర టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..* *అనుమోలు భాస్కరరావు ఇచ్చిన ఫిర్యాదు పై స్పందించిన టౌన్ సిఐ రమేష్..* *నాగార్జునపై క్ర
అక్షరవిజేత, మధిర
మధిర నియోజకవర్గ కేంద్రంలో సంచలనం కలిగించిన భూవివాదంపై ఎట్టకేలకు మధిర టౌన్ పోలీసు విచారణ చేపట్టి కేసు నమోదు చేసిన సంఘటన చోటుచేసుకుంది. మధిర మున్సిపాలిటీకి చెందిన రిటైర్డ్ ఎంఈఓ అనుమోలు భాస్కరరావుమధిర - విజయవాడ రోడ్ లోని 221 సర్వే నెంబర్లు 254.8 చదరపు గజాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నానని, నా స్థలం వద్దకు నేను సెప్టెంబర్ 10వ తారీఖున వెళ్లి అక్కడ నా స్థలంలో ఉన్న పిచ్చి మొక్కలు పీకిస్తుంటే అక్కడికి పట్టణానికి చెందిన చెరుకూరి నాగార్జునఅనే వ్యక్తి వచ్చి నా స్థలంలో నువ్వెవరివి మొక్కలు పెరగటానికి అని నన్ను బెదిరించి..ఇది నా స్థలం దీంట్లోకి వస్తే నీ సంగతి చూస్తా..? నీ అంతు తేలుస్తా..? నీకు దిక్కున్న కాడ చెప్పుకో అని నన్ను బెదిరించాడని రిటైర్డ్ ఎంఈఓ అనుమోలు భాస్కరరావు మధిర టౌన్ పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అనుమోలు భాస్కరరావు ఫిర్యాదు మేరకు టౌన్ సిఐ రమేష్ విచారణ చేపట్టి అతనిపై క్రైమ్ నెంబర్ 224/5 అండర్ సెక్షన్ 329(3)259(బి)351(2) బి ఎం ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగినట్లు అనుమోలు భాస్కరరావు పేర్కొన్నారు. ఈ కేస్ కు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ కూడా అనుమోలు భాస్కరరావుకి పోలీసులు ఇచ్చినట్లు మీడియాకు తెలియజేశారు. ఇప్పుడు మధిరలో ఈ కేసు విషయం చర్చనీయంగా మారింది. ఎవరైనా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే అట్టివారిపై ఈ విధంగానే చర్యలు ఉంటాయనేది పోలీసుల కేసు నమోదు చేయడంతో తేటతెల్లమైంది. ఈ భూ వివాదం మధిరలో గత రెండు సంవత్సరాల నుంచి నలుగుతున్న పరిష్కారం కాలేదు. అనేకమంది మధ్యవర్తిత్వం చేసినప్పటికీ పట్టు వదలని విక్రమార్కుడిలా నేను తప్పు చేయనిది ఎవరికి లొంగను భయపడను ఎవరికీ డబ్బులు ఇవ్వను అని ధైర్యంగా పోరాడి చట్టపరంగా అన్యాయానికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయించిన భాస్కరరావు గురించి మధిర పట్టణ ప్రజలు చెప్పకుంటున్న వైనం..