*నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి: జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్*
అక్షర విజేత మాసాయిపేట
మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట గ్రామం సెంటర్ ని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్ కుమార్ సందర్శించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా రైతులు పాటించాలని సూచించడం జరిగింది. తేమ శాతం 17 కంటే మించ కూడదని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెదక్ టెక్నికల్ ఏవో యాదగిరి, మాసాయిపేట మండల వ్యవసాయ అధికారి కవిత , వ్యవసాయ విస్తరణ అధికారి రజిత, ఏటీఎం కిరణ్, రైతులు తదితరులు పాల్గొనడం జరిగింది.