ఇందిరమ్మ చీరలను పంపిణీచేసిన ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
అక్షర విజేత, పెద్ద శంకరంపేట్:
పెద్ద శంకరంపేట్ మండల కేంద్రంలోనీ రైతు వేదికలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళలకు నాణ్యమైన చీరలను అందించాలని ఉద్దేశంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో మహిళకు నాణ్యమైన చీరలను అందించడం లో బాగంగా ఈరోజు ఇందిరమ్మ చీరలను పంపిణీచేసిన నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి అనే నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు.ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులకు చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఇంతకుముందు ప్రభుత్వములో మహిళలకు ప్రాధాన్యత ఎలా ఉన్నది ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో ఎలా ఉందో మార్పును గమనించాలని కోరారు. గత పది సంవత్సరాల్లో మహిళా సంఘాల్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు.
మళ్లీ ప్రజా ప్రభుత్వం వచ్చాక మహిళా సంఘాలను బలోపేతం చేసి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు.
గత ప్రభుత్వంలో దురదృష్టవశాత్తు మహిళా సంఘం సభ్యురాలు చనిపోతే వారు తీసుకున్న రుణాన్ని తిరిగి వసూలు చేసే వారని, కానీ ఇప్పుడున్న ప్రజా ప్రభుత్వంలో మహిళ ప్రమాద వశాత్తూ చనిపోతే తీసుకున్న రుణము మాఫీ చేయడంతో పాటుగా 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు.
పావలా వడ్డీ రుణాలు,మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, మహిళలు ఆర్థికంగా ఎదిగి కోటీశ్వరులను చేయడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటి లు ఏర్పాటు చేసి మౌలిక సదుపాయాల కల్పన ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా పెట్రోల్ పంపులు, వడ్డీ లేని రుణాలు, అద్దె ఆర్టీసీ బస్సుల నిర్వహన, మహిళా శక్తి క్యాంటీన్ లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, పేదలకు తెల్ల రేషన్ కార్డులు , సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
మహిళలు కుటుంబ బాధ్యతలు తీసుకుంటారని ఇందిరమ్మ ఇళ్లు, కళ్యాణ లక్ష్మి చెక్కులు మహిళలకే ఇస్తున్నట్లు చెప్పారు.
18 సంవత్సరాలు వయస్సు దాటిన ప్రతి మహిళా సంఘం సభ్యులకు ఉచితంగా ఒక చీర ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.