లక్ష్మిదేవిపేటలో వృద్ధుల సంక్షేమ చట్టంపై న్యాయ విజ్ఞాన సదస్సు
అక్షర విజేత, వెంకటాపూర్ (రామప్ప):-
గౌరవ జాతీయ మరియు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థల ఆదేశాలను అనుసరించి, ములుగు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ అధ్యర్యంలో వెంకటాపూర్ మండలం లక్ష్మిదేవిపేట గ్రామ పంచాయతీ ఆవరణలో తల్లిదండ్రులు మరియు వృద్ధుల సంక్షేమం కోసం తెచ్చిన"తల్లీదండ్రుల మరియు వృద్ధుల భరణ -పోషణ చట్టం 2007"గురించి వివరించుటకు న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిది గా చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మేకల మహేందర్ గారు పాల్గొని మాట్లాడుతూ,ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశ్యం కుటుంబ సభ్యుల నుండి భరణం మరియు పోషణ లేని వృద్ధులు మరియు తల్లీ దండ్రులకు న్యాయ పరంగా రక్షణ కల్పించడమని, వృద్ధుల పట్ల గౌరవం, సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, కుటుంబ వ్యవస్థ బలపడడానికి, వృద్దులు గౌరవ ప్రధమైన జీవితం గడపడానికి ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. అలాగే డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బానోత్ స్వామిదాస్ మాట్లడుతూ,ఉచిత న్యాయ సహాయం పొందేవారు టోల్ ఫ్రీ నెంబర్ 15100 కి కాల్ చెయ్యాలని మరియు ఉచిత న్యాయం ఎలా పొందాలో వివరించారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఏ. నాగరాజు, కారోబార్ లక్ష్మణ్, వృద్దులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.