అధికారం పోయినా కూడా అహంకారం తగ్గలేదు ==మిద్దె వీరస్వామి రేవల్లి మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు ==లా చదివిన వకీల్ సాబ్ ఇటువంటి మాటలు మాట్లాడడానికి
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
==పాలమూరు బిడ్డ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే చూసి ఓర్చుకోలేని మిమ్మల్ని చూస్తే సిగ్గు అనిపిస్తుంది.
*వనపర్తి జిల్లా రేవల్లి మండల పరిధిలోని నాగపూర్ గ్రామంలో శుక్రవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడిన మాటలకు రేవల్లి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిద్దె వీరస్వామి మాట్లాడుతూ వనపర్తి లో జరిగిన అభివృద్ధి మీద శ్వేత పత్రానికి సిద్ధమా అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారు సవాల్ విసిరితే కూడా సమాధానం చెప్పుకోలేక ముఖ్యమంత్రి ని నోటికొచ్చినట్లు మాట్లాడుతారా సిగ్గుచేటు.గతంలో మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా, వ్యవసాయ శాఖ మంత్రిగా అవకాశం వస్తే చదువుకున్న విద్యార్థులను హమాలి పని చేసుకొని అని చెప్పారు. ఓ మహిళ నాయకురాల్ని మంగళవారం మరదలు అని మాట్లాడారు. క్యూ లైన్ లో నిలబడిన రైతులను సినిమా టికెట్లతో పోల్చి నీచంగా అవమానించారు. మిమ్మల్ని ఏరకంగా పోల్చాలో మీరే గుర్తుకు తెచ్చుకోండి. చెప్పడానికి మాకు సంస్కారం అడ్డు వస్తుంది.నోటికొచ్చినట్లు మాట్లాడి ప్రజావ్యతిరేకతను ముట్ట గట్టుకొని ఓటమిపాలైన కూడా, గౌరవప్రదమైన ముఖ్యమంత్రి స్థానంలో వ్యక్తిని కూడా నీచంగా మాట్లాడడానికి కొంచెమైన ఉండాలి.అధికారం పోయిన కూడా అహంకారం తగ్గలేదు. జీవితంలో ఒకేసారి ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం వస్తే ఎంపీపీ చేతుల్లో ఓటమి మూట కట్టుకున్న మిమ్మల్ని ఏరకంగా మాట్లాడాలి చెప్పండి.ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజలే న్యాయ నిర్ణయతలు, ముందు మీ గత పరిపాలన చూసి మీకు ప్రజలు ఇచ్చిన బహుమానాన్ని గుర్తుకు తెచ్చుకోండి, ఈరోజు నోటికొచ్చినట్టు మాట్లాడి నవ్వుల పాలు కాకండి.కెసిఆర్ గురించి మాట్లాడితే ఎక్కడలేని అభిమానం వస్తది, మీరు ఎదుటి వారి మీద మాట్లాడితే అదే మీకు వర్తించదా, చెప్పండి.*
*మీ నోరు మంచిదైతే, వనపర్తి కూడా మీకు మంచిదవుతుండే.అయ్యా సారు మొదలు మీ పుచ్చు చూసుకోండి.మీరు అవినీతికి పాల్పడి వేలకోట్లు సంపాదించారాని సాక్షాత్తు కల్వకుంట్ల కవిత చెబుతున్నారు. మొదలు మీకు సిగ్గు, శరం, మానం, మర్యాద ఉంటే కెసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మాట్లాడిన మాటలకు సమాధానం చెప్పండి.ఎన్నికల ముందు కూడా మేఘారెడ్డి 2014 ముందు మీ ఆస్తులు ఎంత ఈరోజుకి ఎంత అని ప్రశ్నించారు. మీకు నీతి నిజాయితీ ఉంటే సమాధానం చెప్పండి. అని ఆయన తీవ్రంగా మీ సమాధానం కోసం వనపర్తి ప్రజలు ఎదురుచూస్తున్నారు.*