*చెట్ల తిమ్మాయిపల్లి పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం*
అక్షర విజేత మాసాయిపేట
మెదక్ జిల్లా మాసాయి పేట మండలం చెట్ల తిమ్మాయిపల్లి ఎం పి యుపిఎస్ పాఠశాలలో డాక్టర్ పి స్వప్నశ్రీ ఎస్ ఏ హిందీ విద్యార్థులకు తన పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు. బాలల దినోత్సవం సందర్భంగా జరిగిన చిత్రలేఖనం పోటీలలో గెలిచిన విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందజేశారు. స్వప్న శ్రీ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచడానికి ప్రోత్సాహకాలు ప్రేరణదాయకంగా పనిచేస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.