అనారోగ్యం తో మాజీ ఈనాడు రిపోర్టర్ వెంకన్న మృతి కుటుంబ సభ్యులను పరామర్శించిన జర్నలిస్ట్ యూనియన్ నాయకులు
అక్షర విజేత,వెంకటాపూర్ ( రామప్ప):-
వెంకటాపూర్ మండలం మాజీ ఈనాడు రిపోర్టర్ మోడెం వెంకన్న అనారోగ్యం తో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న జర్నలిస్ట్ యూనియన్ (ఐ. జే. యూ) ములుగు జిల్లా అధ్యక్షులు ఎండీ షఫీ హమ్మద్, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు బేతి సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ నాయకులు పలువురు బుధవారం వెంకటాపూర్ మండల కేంద్రానికి చేరుకొని వెంకన్న మృతదేహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చటం తో పాటు వెంకన్న మృతి కి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.అదేవిదంగా మరో జర్నలిస్ట్ యూనియన్ (హెచ్ -143) నాయకులు దూడబోయిన రాకేష్ యాదవ్, వేముల సతీష్ తో పాటు పలువురు జర్నలిస్ట్ నాయకులు సైతం వెంకన్న మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అంతేకాకుండా వెంకటాపూర్ మండల జర్నలిస్టు లు సైతం వెంకన్న మృతి పట్ల సంతాపం తెలియజేయటం తో పాటు వెంకన్న అంత్యక్రియల్లో పాల్గొన్నారు.