జనవిజ్ఞాన వేదిక లో విద్యార్థి యొక్క నైపుణ్యాన్ని వెలికితీత.
అక్షర విజేత,చిన్నంబావి.
జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చిన్నంబావి మండలో చెకుముకి సైన్స్ సంబరాలు 2025లో భాగంగా చెకుముకి సైన్స్ పరీక్షను మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక మండల అధ్యక్షుడు సిహెచ్ వెంకటేష్ మరియు చెకుముఖి కన్వీనర్ అలెక్షు మరియు లింగాస్వామి , విద్యార్థులతో మాట్లాడుతూ సమాజంలో విస్తృతంగా సైన్స్ ప్రచారం చేయడం శాస్త్ర దృక్పథం పెంపొందించడం ప్రతి విద్యార్థిలో సైన్సును మరియు సృజనాత్మకత నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ మరియు సైన్స్ ప్రయోగాల పట్ల ఆసక్తిని పెంచుతూ సమాజంలో మూఢనమ్మకలను మూడా విశ్వాసాలను నిర్మూలించడానికి కృషి చేస్తూ నిరంతర కృషికి జన విజ్ఞాన వేదిక సంస్థకు కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విభాగం శాస్త్ర ప్రచారంలో జాతీయ పురస్కారాన్ని అందించింది అదేవిధంగా గత 36 సంవత్సరాల నుండి ఉపాధ్యాయులు అందించిన సహకారంతో జనవిజ్ఞాన వేదిక సంబరాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది అలాగే విద్యార్థులలో సైన్స్ పట్ల ఆసక్తిని కలిగించడానికి సైన్స్ లో ప్రావీణ్యతను పెంపొందించడానికి సైన్స్ అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి శాస్త్రవేత్తలుగా ఎదగడానికి తోడ్పడే విధంగా రూపొందించిన సైన్స్ సంబరాలు అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర శిక్ష విభాగం కూడా చేయూతనిచ్చింది చెకుముకి సంబరాలలో పాల్గొనుటకు 8,9,10, వ తరగతి విద్యార్థులు అర్హులు ఈ సైన్సు సంబరాలు మొదటగా పాఠశాల స్థాయి, మండల స్థాయి, జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి సంబరాలుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మండల స్థాయిలో మొదటి బహుమతి రెండవ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల నైపుణ్యాల అభివృద్ధికి మరియు ఇలా ప్రతి సంవత్సరం జన విజ్ఞాన వేదిక కార్యక్రమాలకు సహకరిస్తున్నటువంటి చిన్నంబావి మండలానికి సంబంధించిన ప్రతి ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేటు పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకి ,సైన్స్ టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతం చేశారని జె జె వి మండల అధ్యక్షుడు సిహెచ్ వెంకటేష్ తమ జెవివి మండల కమిటీ సభ్యులు తెలియజేశారు.