*జర్నలిస్ట్ మస్తాన్ వలికి ఎమ్మెల్యే ప్రత్తిపాటి సత్కారం* - ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికవ్వడంపై అభినందనలు - చిలకలూరిప
చిలకలూరిపేట అక్షర విజేత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సీనియర్ జర్నలిస్ట్ షేక్ మస్తాన్ వలిని చిలకలూరిపేట శాసనసభ్యులు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఘనంగా సత్కరించారు. పట్టణంలోని ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మస్తాన్ వలిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. అనంతరం ప్రత్తిపాటి మాట్లాడుతూ... చిలకలూరిపేటలో సీనియర్ జర్నలిస్టుగా సుదీర్ఘ అనుభవం ఉన్న మస్తాన్ వలికి రాష్ట్రస్థాయి పదవి దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక పాత్రికేయులకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ కరీముల్లా, వైస్ చైర్మన్ పిల్లి కోటి, టిడిపి సీనియర్ నాయకులు తేళ్ల సుబ్బారావు ల తో పాటు ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అలపాటి ఆంజనేయులు,(ఐ న్యూస్) శ్రీకాంత్ (10 tv), కుప్పం కళ్యాణ్ చక్రవర్తి,(బిగ్ tv )సుభాని(N tv) కోటేశ్వరావు, (ప్రైమ్ 9)శివ, (భారత్ టుడే)రవి (సిటీ న్యూస్)మరియు ఏపీయుడబ్ల్యుజే జిల్లా కమిటీ సభ్యులు అడపా అశోక్, ఎన్ వి ఎస్ వి ప్రసాద్, చిలకలూరిపేట కార్యదర్శి దర్యా వలి, జర్నలిస్టులు దీవి దాసు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.