డోంగ్లి మండల బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా డోంగ్లి మండల బిఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాజు పటేల్, ప్రధాన కార్యదర్శిగా విజయ్ పటేల్, ఉపాధ్యక్షులుగా సంజయ్ మాన్కరే, కార్యవర్గ సభ్యులుగా సంజు పటేల్, మధుకర్ పటేల్, జానీమియాలతో నూతన కార్యవర్గాని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఎన్నుకున్నందుకు కష్టపడి పార్టీ కోసం పని చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.