ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి == ఆరు గ్యారంటీల విషయంలో అధికార పార్టీ విఫలం ==మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
అక్షర విజేత గోపాల్పేట, రేవల్లి;
వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని సోమవారం మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి పబ్బతి పర్వతాలు నివాసంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ 6 గ్యారంటీ లతోపాటు మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అదేవిధంగా సర్పంచి ఎన్నికల వేళలో ఏలాంటి మోసపూరిత మాటలకు గాని హామీలకు గాని మోసపోకుండా ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక సంఖ్యలో గెలిపించుకొని అధికార పార్టీకి గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. అదేవిధంగా రేవల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పబ్బతి పర్వతాలను అధిక మెజార్టీతో గెలిపించి గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆయన దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగం తిరుపతిరెడ్డి, మాజీ జెడ్పిటిసి భీమయ్య, మాజీ వైస్ ఎంపీపీ మధుసూదన్ రెడ్డి, రేవల్లి మాజీ సర్పంచ్ గౌతమి శివరామిరెడ్డటిఆర్ఎస్కో ఆప్షన్ నెంబర్ కాజా, అలాగే బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.