*చిలకలూరిపేటలో విషాదం* *కన్నంనాయుడు మృతి* *కుటుంబాన్ని పరామర్శించిన జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ*
పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్షర విజేత
చిలకలూరిపేట నియోజకవర్గంలో ఇటీవల జరిగిన ఒక దారుణ ప్రమాదం26వ వార్డు ప్రజలను విషాదంలో ముంచెసింది. కూలి పనుల నిమిత్తం చిలకలూరిపేటకు వలస వచ్చిన కన్నంనాయుడు (38) మంగళవారం రాత్రి ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
వివరాల్లోకి వెళ్తే కన్నంనాయుడు ఊక లోడుతో వెళ్తున్న ఒక లారీపై ఉన్నారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తాకడంతో, ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కన్నంనాయుడు మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ఆయనకు భార్య ఆదిలక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబాన్ని పోషించే పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.
*జనసేన యువ నాయకుల అండ*
ఈ విషాద వార్త తెలుసుకున్న నియోజకవర్గ జనసేన యువ నాయకులు మండలనేని చరణ్ తేజ చిలకలూరిపేట జనసేన పార్టీ సమన్వయకర్త తోట రాజా రమేష్ ఇరువురు తక్షణమే కన్నంనాయుడు కుటుంబ సభ్యుల వద్దకు చేరుకున్నారు. ఆయన వారిని ఓదార్చి, ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో వారికి అండగా ఉంటామని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు."ఏ విషయమైనా, ఎటువంటి సహాయం కావాలన్నా తనను సంప్రదించవచ్చని," మండలనేని చరణ్ తేజ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.