*జంమ్గి బి, గ్రామంలోని బోకస్ ఓట్లను తొలగించాలి.* *ఎమ్మార్వో ఎంపీడీవో ను వినతి పత్రం అందించిన స్థానిక యువ నాయకులు,*
అక్షర విజేత,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని జంమ్గి బి గ్రామ పంచాయతీ లో బొక్కస్ ఓట్లను తొలగించాలని స్థానిక యువజన సంఘాల నాయకులు సోమవారం,ఎమ్మార్వో భాస్కర్,ఎంపీడీవో సత్తయ్య,ను వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్ల నమోదు జరగలేదని మండిపడ్డారు. బోకర్స్ ఓట్లు నమోదు అయినట్లు తెలిపారు. ఇతర గ్రామాల ప్రజల పేర్లు తమ గ్రామం ఓటర్ జాబితాలో నమోదు అయినట్లు తెలిపారు. ఎలక్షన్ నిర్వహిస్తున్న సమయంలో ఓటు వేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ చిత్రం పరిశీలించేటట్టుగాలు పోలింగ్ ఏజెంట్లను అనుమతించాలని అన్నారు.ఇట్టి విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో దత్తు రావు,ఈశ్వర్, అంజయ్య చారి,లింగం, తదితరులు పాల్గొన్నారు.