చిలకలూరిపేట నారాయణ స్కూల్లోఈ _ కిడ్జ్ ఎన్ .పి .ఎల్ నారాయణ ప్రీమియర్ లీగ్ -కిడ్స్ స్పోర్ట్స్ ఈవెంట్
చిలకలూరిపేట అక్షర విజేత
నారాయణ స్కూల్ చిలకలూరిపేటలో ఈ _ కిడ్జ్ ఎన్ .పి .ఎల్ ( నారాయణ ప్రీమియర్ లీగ్ -కిడ్స్ స్పోర్ట్స్ ఈవెంట్ ) ఉత్సాహంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు వివిధ క్రీడా పోటీలలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు.
కార్యక్రమానికి ప్రిన్సిపాల్ కె. శేషగిరి రావు ముఖ్య అతిథిగా హాజరై ఎన్ .పి .ఎల్. పోటీలను ప్రారంభించారు.
ఆదేవిధంగా వైస్ ప్రిన్సిపాల్ వసుంధ్ర పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడంలో స్పోర్ట్స్ టీచర్ కె. కృపా రావు కీలక పాత్ర పోషించారు.
ఎన్ .పి .ఎల్ సందర్భంగా ఈ _ కిడ్జ్ విద్యార్థులు
రన్నింగ్ రేస్ 50 మీటర్
50 మీటర్ హెడ్డిల్ రేస్
50 మీటర్ బీన్ బాగ్ బ్యాలెన్స్
గెట్ రెడీ టు స్కూల్
లాంటివాటిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారుల ఉత్సాహం, క్రీడాస్ఫూర్తి, ఆనందం కార్యక్రమాన్ని మరింత ప్రత్యేకంగా మార్చింది.
ప్రిన్సిపాల్ కె. శేషగిరి రావు మాట్లాడుతూ, "పిల్లల సమగ్ర అభివృద్దికి క్రీడలు ఎంతో కీలకం. ఈ వయసులో నిర్వహించే క్రీడా కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం మరియు శారీరక చురుకుదనం పెంపొందిస్తాయి". అన్నారు.
కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. విజేతలకు పతకాలు మరియు ప్రశంసాపత్రాలు అందజేయబడ్డాయి.