సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లో ఏసీబీ సోదాలు..
అక్షర విజేత వనపర్తి ప్రతినిధి
వనపర్తి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అనిశా అధికారుల ఆకస్మిక సోదాలతో కలకలం రేగింది. అక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో వనపర్తి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మహబూబ్ నగర్ రేంజ్ డీఎస్పీ బాలకృష్ణ శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. కార్యాలయంలో పని చేసే సిబ్బంది ఫోన్లను అధికారులు సిజ్ చేసినట్లు తెలిపారు. ఈ సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఆయన స్పష్టంచేశారు. కాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న దృష్ట్యా కార్యాలంలోని సీసీ కెమెరాలను ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. రిజిస్ట్రేషన్ చలాన్ చెల్లించిన సబ్ రిజిస్టర్ కు అదనగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, అలాగే రిజిస్టర్ డాక్యుమెంట్లో సంతకాలు పెట్టె దగ్గర ఒక్కో రిజిస్ట్రేషన్ కు రూ. 100నుండి 200వందలు బహిరంగంగా వసూళ్లు చేస్తున్నారని పలు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. వీటిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేచి చూడాలి