మద్నూర్ బాలుర గురుకుల పాఠశాలకు 11వేల విరాళం
అక్షర విజేత బిచ్కుంద
కామారెడ్డి జిల్లా మద్నూర్ బాలుర గురుకుల పాఠశాల అభివృద్ధి కొరకు 11వేల విరాళాన్ని బిచ్కుంద గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆస్పత్ వార్ శ్రీనివాస్, కాంగ్రెస్ రాష్ట్ర యువజన నాయకులు భాస్కర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సాయం చేశామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.